పాలకొండలోని బద్దుమసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థులకు పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు, కేంద్ర అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాలపై బుధవారం అవగాహన కల్పించారు. విద్యుత్ సరఫరా ఉన్న మంటలను అదుపు చేసే పద్ధతులపై, అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు సర్వేశ్వరరావు వివరించారు. వీరితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.