విద్యార్థులు రహదారి భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలని పోలీస్ సిబ్బంది తెలిపారు. ఈ మేరకు పాలకొండ పట్టణంలో యలం కూడలి వద్ద బుధవారం వారికి చైతన్యం కల్పించారు. విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు తెలిసినట్లయితే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చునని ఏ ఎస్సై అన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని విద్యార్థులకు సూచించారు.