సీతంపేట మండల యువత శిక్షణ కేంద్రంలో ఈ నెల 11న ఉద్యోగ మేళా నిర్వహిస్తామని ఐటీడీఏ పీఓ సి. యశ్వంత్ కుమార్ పేర్కొన్నారు. 12 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నట్లు చెప్పారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ చదివి 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు 63012 75511, 79937 95796 నంబర్లను సంప్రదించాలన్నారు.