పాలకొండ నగర పంచాయతీలోని శానిటేషన్ సిబ్బందికి శుక్రవారం సేఫ్టీ కిట్లను నగర పంచాయతీ ఛైర్మన్ ప్రతాప్, కమిషనర్ సర్వేశ్వర రావు శుక్రవారం అందజేశారు. పట్టణంలోని సెప్టిక్ ట్యాంక్ క్లినింగ్ కోసం వెళ్లే ఎంపిక చేసిన సిబ్బందికి ప్రభుత్వం నుంచి వచ్చిన బ్లౌజ్లు, మాస్క్ తదితర సామగ్రిని వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు సంతోష్ పాల్గొన్నారు.