పాలకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పాలకొండ మండల విద్యాశాఖ అధికారి-2 సోంబాబు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి ప్రధాన పరీక్షలకు చదువుతున్న విద్యార్థుల తరగతులకు వచ్చి విద్యార్థులను, హెచ్ఎంను, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. 10వ తరగతి ప్రధాన పరీక్షల్లో అధిక మార్కులు వచ్చేవిధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు హెచ్ఎం ఎమ్ సూర్యనారాయణ, ఉపాధ్యాయులు బౌరౌతు శంకరరావు తెలిపారు.