మన్యం జిల్లా పాలకొండ పట్టణంలోని వ్యాధులు ప్రబలుతున్నాయి. ఎక్కడికక్కడే జ్వరపీడితుల సంఖ్య పెరుగుతుంది. గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతంలో కూడా జ్వరాలతో బాధపడుతున్న వారు ఎక్కువగానే ఉన్నారు. ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేట్ హాస్పటళ్లు కూడా రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇందులో భాగంగా పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో గల ఎస్టీ బాలురు వసతిగృహంలో విద్యార్థులు గత వారం రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నారు.