పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ వీరఘట్టం రోడ్డులోని అచ్యుత రైస్ మిల్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పి వాహనం వీరఘట్టం వైపు వెళ్తుండగా మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి, విద్యుత్ స్తంభాన్ని కూడా ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.