సీతంపేట ఐటీడీఏ పివోకు వినతిపత్రం

58చూసినవారు
సీతంపేట ఐటీడీఏ పివోకు వినతిపత్రం
పార్వతీపురం జిల్లా సీతంపేట మండలం పెద్దూరు, పాతపనుకువలస గ్రామస్థులు సీతంపేట ఐటీడీఏ పీవో సి.యశ్వంత్ కుమార్ రెడ్డికి బుధవారం వినతి పత్రం అందజేశారు. 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న పెద్దూరు గ్రామపంచాయతీ క్లస్టర్ పేరుతో నాన్ ఏజెన్సీ పరిధిలో ఉన్న సోమగండి సచివాలయంలో కలపడంతో 5వ షెడ్యూల్ ప్రాంతం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. 5వ షెడ్యూల్ ప్రాంతంలోని పెద్దూరు గ్రామ సచివాలయం యథావిధిగా విధులు కొనసాగించాలని గ్రామస్థులు కోరారు.

సంబంధిత పోస్ట్