వీరఘట్టం మేజర్ పంచాయతీకి చెందిన 18 షాపులను అద్దెకు ఇచ్చేందుకు ఈనెల 13న ఉదయం 9 గంటలకు పంచాయతీ కార్యాలయం వద్ద బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ రాము గురువారం తెలిపారు. స్థానిక అంబేడ్కర్ జంక్షన్ లో పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న షాపులకు వేలంపాట నిర్వహిస్తామని పేర్కొ న్నారు. ఆసక్తి ఉన్నవారు వేలంపాటలో నేరుగా పాల్గొనాలని కోరారు. పూర్తి వివరాలకు పంచాయతీ ఆఫీసు పనివేళల్లో సంప్రదించాలని తెలిపారు.