విశాఖపట్నంలో నిర్వహించిన 8వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో సీతంపేట మండలం పెద్దూరు గ్రామానికి చెందిన ఆరిక యగ్నిక్ (6) గిరిజన విద్యార్థి పాల్గొని అంతర్జాతీయ కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ క్రీడాకారుడిని మంగళవారం సీతంపేట ఐటీడీఏ పీవో సి. యశ్వంత్ కుమార్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ కోచ్ తోట సింహాచలం, కోచ్ ఆరిక సింహాచలం తదితరులు పాల్గొన్నారు.