పాలకొండ నగర పంచాయతీ పరిధిలో మెరుగైన పారిశుధ్య నిర్వహణకు షాపింగ్ యజమానులు, వర్తకులు తప్పనిసరిగా డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ టి. జయరామ్ మంగళవారం అన్నారు. ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. 65 లీటర్ల సామర్థ్యం ఏర్పాటు చేసుకొని చెత్తసేకరణకు వచ్చే సిబ్బందికి అందించాలన్నారు. రోడ్లపై చెత్త వేయరాదన్నారు. ఒకవేళ ఎవరైనా వేస్తే అపరాద రుసుం విధిస్తామన్నారు.