పార్వతీపురం మన్యం జిల్లా ఏకలవ్య పాఠశాల విద్యార్థులు శత శాతం ఫలితాలతో ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలోని అనసభద్ర, కొటికిపెంట, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, భామిని ఏకలవ్య విద్యాలయాల్లో 10+2 సీబీఎస్ఈ ఎంపీసీ, బైపీసీ, హెచ్ఐసీ పరీక్షల్లో 254మంది విద్యార్థులు హాజరుకాగా అంతా ఉత్తీర్ణత సాధించినట్లు బుధవారం పాఠశాల వర్గాలు తెలిపాయి.