పార్వతీపురం పట్టణంలో మంగళవారం పూడికతీత పనులు చేస్తున్న సమయంలో ఒక ఆస్థి పంజరం బయట పడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. రైల్వే ట్రాక్ సమీపంలోని శ్మశాన వాటిక నుంచి వరద నీటితో కొట్టుకువచ్చినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. సీఐ నారాయణరావు, ఎస్ఐ గోవిందరావు ఆధ్వర్యంలో సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు.