అంటిజోల – మణిగి బిటి రోడ్డు పరిశీలన

74చూసినవారు
అంటిజోల – మణిగి బిటి రోడ్డు పరిశీలన
కురుపాం మండలంలో జి. శివడ పంచాయతీలో గల అంటిజోల నుండి మణిగి గ్రామానికి 2. 3 కిలోమీటర్ల బిటి రోడ్డును పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ ఎంశ్రీనివాస్‌, పంచాయతీరాజ్‌ ఇఇ జి. రవి మంగళవారం పరిశీలించారు. ఈ రోడ్డు వేసిన రెండు వారాలకే ఎక్కడికక్కడ పెచ్చులూడి నాణ్యత డొల్లతనం తేటతెల్లమైంది. పలువురు ఆరోపణ మేరకు జిల్లా కలెక్టర్‌ స్పందించి నిర్మాణ పనులపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నివేదిక అందజేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్