లిడికివలసలో రైతులకు అవగాహన సదస్సు

889చూసినవారు
లిడికివలసలో రైతులకు అవగాహన సదస్సు
పార్వతీపురం మండలం గోచెక్క పంచాయతీ లిడికివలస గ్రామంలో ఆదివారం నవధాన్యాలు విత్తన గుళికలు (సీడ్ బాల్స్) తయారు చేయడంపై రైతులకు అవగాహన కల్పించారు. మండల యాంకర్ గంట తవుడు మాట్లాడుతూ.. మన ప్రాంతంలో వాతావరణ మార్పుల వల్ల వర్షాలు పడకపోవడం, పొడి భూములలో పంటలు వేయకపోవడం వంటి పరిస్థితులలో ప్రకృతి వ్యవసాయ పద్దతిలో విత్తన గుళికలు తయారు చేసికుని పొడి భూములలో చల్లుకోవాలన్నారు. ఈ విత్తన గుళికలు చల్లటం వల్ల భూమిలో ఉన్న తెగుళ్లు నుండి చీడ పీడల తట్టుకుంటుందని తెలిపారు. అదేవిధంగా విత్తనంలో తేమ శాతం నిల్వ ఉంటుందన్నారు. విత్తనాలను పక్షులు, చీమలు, పురుగులు తినకుండా ఉంటాయన్నారు. వర్షం పడే వరకు విత్తనాలు చెడిపోకుండా భద్రంగా ఉంటాయని చెప్పారు. వర్షం పడిన తర్వాత మొలకెత్తుతాయని అన్నారు. కాబట్టి రైతులందరూ ఈ విధంగా విత్తన గుళికలు తయారు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీలు ఉర్లక నాగార్జున, ప్రశాంత్, రైతులు నాసిక త్రినాధ్, ఉర్లక సత్యం, రామకృష్ణ బంగార్రాజు, రూపవతి, కృష్ణవేణి, ధనలక్ష్మి, విజయమ్మ, చంద్రకళ, గరికమ్మ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్