వాహనాలు నడిపే వారంతా నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే అపరాధ రుసుం వేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ జ్ఞానప్రసాద్ స్పష్టం చేశారు. బొబ్బిలి పట్టణంలో బుధవారం వాహనాలను తనిఖీ చేశారు. సీ బుక్, ఇన్స్యూరెన్స్, డ్రైవింగ్ లైసెన్సులను పరిశీలించారు. రహదారుల్లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నందున వాటి నివారణకు చర్యలు చేపడుతున్నామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.