బొబ్బిలిలో శ్రీఅయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్పస్వామి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పూజలు శుక్రవారం తెల్లవారు జామున నుంచి ప్రారంభించడంతో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అయ్యప్ప నామస్మరణతో ఆలయం మార్మోగింది. అయ్యప్పస్వామికి అభిషేకాలు, మూలమంత్ర హోమాలు, 18 మెట్ల పడిపూజ అంగరంగ వైభవంగా చేశారు. భక్తులకు అర్చకులకు ప్రసన్నకుమార్ శర్మ అందించారు.