ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసుకోవాలి

68చూసినవారు
ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసుకోవాలి
ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారి ఎం వి కరుణాకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మనఇళ్ళు మన గౌరవం కార్యక్రమంపై గృహ నిర్మాణాన్ని లబ్ధిదారులతో శనివారం సీతానగరం మండల హౌసింగ్ ఏఈ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మన ఇళ్ళు మన గౌరవం కార్యక్రమం క్రింద ఇప్పటికే మంజూరు చేసిన ఇళ్ళను లబ్ధిదారులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలోగా పూర్తి చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్