గరుగుబిల్లి మండలం గిజబ గ్రామంలో గ్రామ దేవతా తిరునాళ్ళ సందర్భంగా ఆనాటి జానపద కళ శివభాగవతం (గంగా గౌరి సంవాదం)కు పుట్టినిల్లుగా పేరొందిన మార్కొండపుట్టి గ్రామ కళాకారులచే కడు రమ్యంగా మంగళవారం ప్రదర్శించారు. పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా వేద బ్రహ్మ శ్రీ పంతుల గుంపస్వామి గురువుకి చిరు సన్మానం చేసి, కళాకారులను ఆశీర్వదించారు.