పేదలపై రెవిన్యూ కేసులు పెట్టడం అన్యాయం

63చూసినవారు
పేదలపై రెవిన్యూ కేసులు పెట్టడం అన్యాయం
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాడు ఏ విధమైన సబ్‌ డివిజన్‌ చేయకుండా నేడు ఇల్లు కట్టుకుంటున్న పేదలపై కేసులు పెట్టడం అన్యాయమని, వెంటనే కేసులు పెట్టకుండా ఆపాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలోని తూరుమామిడిలో ఇళ్లు కట్టుకుంటున్న పేదలపై తప్పుడు కేసులు ఆపాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ, నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్