సీతంపేట యూత్ ట్రైనింగ్ సెంటర్ లో బుధవారం నిర్వహించిన జాబ్ మేళాలో 168 మంది అభ్యర్థులు పాల్గొనగా, 54 మందిని వివిధ కంపెనీలు ఎంపిక చేశాయి. ఈ కార్యక్రమాన్ని జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. నిరుద్యోగ యువత ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారి కృష్ణ చైతన్య సూచించారు. ప్రిన్సిపల్ గోపికృష్ణ హాజరయ్యారు.