కొమరాడ: రైల్వే గేట్ విరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్

81చూసినవారు
కొమరాడ: రైల్వే గేట్ విరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్
రైల్వే గేటును ఓ వ్యాన్ ఢీకొట్టడంతో రైల్వే గేట్ విరిగిన క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయిన ఘటన కొమరాడ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని అర్తం గ్రామ సమీపంలో గల రైల్వే గేటును కూనేరు నుండి పార్వతీపురం వెళుతున్న వ్యాన్ ఢీకొట్టడంతో రైల్వే గేట్ విరిగిపోయింది. దీంతో రైల్వే గేట్ కీపర్ ముందస్తు జాగ్రత్తలో భాగంగా రైల్వే గేట్ ను మూసివేశారు. దీంతో అంతర్రాష్ట్ర రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్