కురుపాం మండలం వలస బల్లేరు పంచాయతీ గిరి శిఖర గ్రామమైన ఆగంగూడలో తాగు నీటి కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం అధికారులు ఆ గ్రామానికి వెళ్లి మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేసేందుకు బోరు పనులు చేపట్టారు. నీటి సమస్యను తీరుస్తున్నందుకు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.