పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో కురుపాం మోడల్ స్కూల్ 9వ తరగతి విద్యార్థిని ఎన్. మహాలక్ష్మి పాల్గొంది. పాఠశాల ప్రిన్సిపల్ రామలక్ష్మి మాట్లాడుతూ మండల స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికవ్వడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో కూడా ఉత్తమ ప్రదర్శన కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అభినందించారు.