లక్ష్యాల సాధనకు కృషి చేయాలి

50చూసినవారు
లక్ష్యాల సాధనకు కృషి చేయాలి
వ్యవసాయ, అనుబంధ రంగాల్లో లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఏటా 15 శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. జిల్లాలో ఏటా 2.20 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉన్న పాల దిగుబడి ఈ ఏడాది మరింతగా పెరగాలి. గోశాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి. మత్స్య సంపదను పెంచాల్సి ఉంది. జీడి, పసుపు, పైనాపిల్‌, పామాయిల్‌ ఇతర అంతర పంటలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. గొర్రెలు, పశువులు, కోళ్ల పెంపకం యూనిట్లను ప్రోత్సహించాలి.’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్