పోషకాహర మాసోత్సవాలు సందర్భంగా పార్వతీపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోగల తాళ్ల బురిడి గ్రామం లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో బుధవారం అంగన్వాడీ కార్యకర్తలు పోషకాహార మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గర్భిణీలకు, బాలింతలకు అవగాహన కల్పించారు. తల్లులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు ఆకుపచ్చని పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు తో వండిన వంటలు ప్రదర్శన పెట్టడం జరిగిందని అన్నారు.