ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు వచ్చే దరఖాస్తులు పునరావృతం కాకూడదని డి. ఆర్. డి. ఏ. పి డి ఎమ్. సుధా రాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పిజిఆర్ఎస్ కు వచ్చే ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి కచ్చితమైన పరిష్కారం చూపించాలని తెలిపారు. ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. 44 దరఖాస్తులు అందాయన్నారు.