పార్వతీపురం పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో యూపీహెచ్‌సీ వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఆసుపత్రుల్లో క్షేత్రస్థాయి సేవలు, నెలవారీ నివేదికలు , ఓపీ వివరాలు, ల్యాబ్ పరీక్షలు, మందులు, ఈహెచ్‌ఆర్ నమోదుపై చర్చించారు. ఆరోగ్య వివరాలు ఆయుష్మాన్ భారత్ ఐడీతో అనుసంధానమై ఉండాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.