పార్వతీపురం: విద్యతోనే ఉజ్వల భవిష్యత్

81చూసినవారు
పార్వతీపురం: విద్యతోనే ఉజ్వల భవిష్యత్
విద్యతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్ సాధ్యమౌతుందని రెండవ అదనపు మన్యం జిల్లా జడ్జి ఎస్. దామోదరరావు అన్నారు. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కోర్టు ఆవరణలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఆధ్వర్యంలో లీగల్ సర్వీసెస్ చైల్డ్ ఫ్రైండ్లీ స్కీంలో భాగంగా మండల విద్యా శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. పార్వతీపురం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ మండల విద్యా శాఖాధికారులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్