పార్వతీపురం: తాగు నీటి పథకాల క్లోరినేషన్ జరగాలి

75చూసినవారు
పార్వతీపురం: తాగు నీటి పథకాల క్లోరినేషన్ జరగాలి
మన్యం జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా విస్తృత చర్యలు చేపట్టాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. వివిధ పత్రికల్లో తాగునీటి సమస్యపై వచ్చిన వార్తల పై జిల్లా కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి తీవ్రత దృష్ట్యా అధికారులు స్పష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి పథకాలను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్