మన్యం జిల్లా సీతానగరం మండలం జోగింపేట కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సు సందర్శించి అనంతరం పల్లెనిద్ర కార్యక్రమంలో గురువారం రాత్రి జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల భోజనశాలను పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. బలవర్థక నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని అన్నారు. విద్యా బోధనపై విద్యార్థుల నుండి ఆరా తీశారు.