కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణ పనులను వేగవంతం చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.శ్రీనివాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అభివృద్ధి వేదిక బృందం శుక్రవారం మెంటాడ మండలం కుంటినవలస వద్ద నిర్మితమవుతున్న సిటియు భవన నిర్మాణాలను పరిశీలించింది. అనంతరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ టివి కట్టమణిని కలసి పలు సమస్యలపై చర్చించారు.