మన్యం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పల్లె నిద్రలో భాగంగా శనివారం గుమ్మలక్ష్మీపురం మండలం రాయగడ జమ్ము గ్రామం దగ్గరలో గల గోరడకు గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలను జిల్లా మత్స్యశాఖ అధికారి వేముల తిరుపతయ్య పరిశీలించారు. ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన ఆహారం, ఉపాధ్యాయులు బోధిస్తున్న విద్యా ప్రమాణాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ విద్యార్డులు దోమలతో ఇబ్బంది పడటం గమనించారు.