సైబర్ నేరగాళ్లు పెట్టే ప్రలోభాలకు గురికావద్దని, వారు చేసే వివిధ మోసాలకు దూరంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అపరిచితుల నుంచి వచ్చే మొబైల్ నంబర్లకు బదులివ్వవద్దని, డిజిటల్ అరెస్టులు లాంటివి లేవని కలెక్టర్ తేల్చిచెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డిజిటల్ అరెస్ట్ అని ఎవరైనా చెప్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు.