ప్రణాళికా బద్ధంగా పనిచేసి పాడిరైతుల ఆదాయ వృద్ధి రేటు పెంచాలన్న లక్ష్యంతో కృషి చేయాలని మన్యం జిల్లా కలక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పార్వతీపురం ఉద్యానవన కళాశాలలో వ్యవసాయ అనుబంధ రంగాల కన్వర్జెన్స్ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. వ్యవసాయ అనుబంధరంగ రైతుల ఆదాయం రెట్టింపు చేసి జీవన ప్రమాణాలను వృద్ధి చేసి తద్వారా రాష్ట్ర జీడీపీ, జి.ఎస్.డి.టి స్థాయి 15-20 శాతం వృద్ధి రేటు సాధించాలన్నారు.