పార్వతీపురం: జిల్లాలో 11 రహదారులకు అటవీ అనుమతులు

67చూసినవారు
పార్వతీపురం: జిల్లాలో 11 రహదారులకు అటవీ అనుమతులు
జిల్లాలో 11 రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతులు మంజూరయ్యాయి. బుధవారం కలెక్టర్‌ ఎ. శ్యామ్‌ప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ వర్చువల్‌ సమావేశంలో అనుమతులు మంజూరయ్యాయి. గిరిజన ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించే ఉద్దేశంతో కురుపాం, తిత్తిరి, దొమ్మిడి, జె.పులుపుట్టి ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి అంగీకారం తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్