పార్వతీపురం: ఫోర్టిఫైడ్ సన్న బియ్యం పంపిణి

84చూసినవారు
పార్వతీపురం: ఫోర్టిఫైడ్ సన్న బియ్యం పంపిణి
పార్వతీపురం మన్యం జిల్లాలో మధ్యాహ్న భోజనం పథకానికి 19,741 బస్తాలు ఫోర్టిఫైడ్ సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని డీఆర్వో హేమలత గురువారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,504 పాఠశాలలు, 150 వసతి గృహాలకు ఈ బియ్యం మంజూరు చేసినట్టు చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన, బలవర్ధక ఆహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్