పార్వతీపురం పరిశుభ్రతకు ప్రజల భాగస్వామ్యం అవసరమని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పలు వార్డులలో ఆయన పరిశీలించారు. స్వచ్ఛ సుందర పార్వతీపురం సాధనకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరు తాము వినియోగించిన చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేసి మున్సిపల్ వాహనానికి అందజేయాలన్నారు.