బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వామపక్ష ప్రజాసంఘాల నాయకులు కోరారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో ఐఎఫ్‌టియు నాయకులు పోల ఈశ్వర రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.