సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని విద్యా శాఖ మంత్రి లోకేశ్ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు ఎస్జీటీలకు ఆన్ లైన్ కౌన్సెలింగ్ బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్.. టీడీపీ ఎమ్మెల్సీల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.