పార్వతీపురం: ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు మెరుగు పర్చాలి

52చూసినవారు
పార్వతీపురం: ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు మెరుగు పర్చాలి
పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను మెరుగు పర్చాలని మన్యం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు ఆదేశించారు. యూపీహెచ్ సి వైద్యాధికారుల సిబ్బందితో గురువారం ఆరోగ్య కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిపారు. ఆసుపత్రుల్లో క్షేత్ర స్థాయి సేవలపై నెల వారీ నివేదికలను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రాల్లో ఓపి వివరాలు, ల్యాబ్ పరీక్షల పై ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లాస్థాయి వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్