పార్వతీపురం: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

57చూసినవారు
పార్వతీపురం: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకుంటే మానసిక ప్రశాంతత సొంతం చేసుకోవచ్చని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో అయ్యప్ప దేవాలయం వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు సాదరంగా ఆహ్వానించారు. అయ్యప్ప స్వామికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలో అయ్యప్ప దేవాలయాన్ని అభివృద్ధి చేసి శాస్త్రోక్తంగా పూజలు చేయడం అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్