పార్వతీపురం మున్సిపల్ అధికారులతో స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సమీక్ష గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలపై వెంటనే నోటీసులు అందించి తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు. ఎర్రకంచమ్మ, శ్రీ ఇప్పలపాలమ్మ అమ్మవార్ల పండగలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.