పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు వినతల రూపంలో అందించిన సమస్యలను పరిశీలించి వాటిలో తక్షణమే పరిష్కరించాల్సినవి అక్కడికక్కడే పరిష్కార మార్గాన్ని చూపారు. మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి పూర్తి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఈ ప్రజాదర్బార్ నిర్వహించడం జరుగుతుందన్నారు.