మున్సిపల్ పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా కన్వీనర్ బి. వి. రమణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వై. మన్మధరావు డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా దారుణమన్నారు.