రీసర్వే, రెవిన్యూ సదస్సులు, మీ సేవా పోర్టల్ ద్వారా వచ్చే మ్యూటేషన్లను నిర్ణిత కాల వ్యవధిలోగా ( 30 రోజులు ) పరిష్కరించాలని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తహశీల్దార్లకు తేల్చిచెప్పారు. 30 రోజులు దాటి ఒక్క రోజు ఆలస్యమైన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం రెవిన్యూ సమస్యలపై రెవిన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.