భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై మతోన్మాద శక్తులు అనేక రూపాల్లో దాడి చేస్తున్నాయని, దీన్ని ముక్తకంఠంతో విద్యార్థులంతా వ్యతిరేకించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. రామ్మోహన్ అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ మన్యం జిల్లా 32వ మహాసభలు సందర్భంగా శనివారం పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్, పాత బస్టాండ్ వరకు విద్యార్థుల ప్రదర్శన చేపట్టారు. స్వేచ్ఛ, సమానత్వం ప్రజల నడుమ నెలకొల్పినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుందన్నారు.