సామర్థ్యానికి మించి వాహనాలలో సరుకు లోడ్ చేసి రవాణా చేస్తే జరిమానాలు తప్పవని మన్యం జిల్లా రవాణాశాఖాధికారి టి. దుర్గా ప్రసాద్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరఘట్టం మండలంలో అధిక లోడుతో వచ్చే ట్రాక్టర్లు, ఆటోలు, ఇతర వాహనదారులకు, ట్రాక్టర్ల యజమానులకు, డ్రైవర్లకు అవగాహనా కార్యక్రమం జరిగిందని అన్నారు. వ్యవసాయ సీజన్ కావటంతో అధికలోడ్ చేయడం వల్ల కలిగే అనర్ధాలను డ్రైవర్లకు వివరించామని పేర్కొన్నారు.