మన్యం జిల్లా శంబర శ్రీ పోలమాంబ అమ్మవారు జాతరకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జనవరి 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే శంబర పొలమాంబ జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం శంబర జాతరను రాష్ట్ర కార్యక్రమంగా ప్రకటించిన సంగతి విధితమే అన్నారు. జాతరను విజయవంతం చేయాలన్నారు.