మరో ఏడాదిలో ప్రభుత్వ స్కూళ్లలో సీట్లకు సిఫారసుచేసే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ విద్యను ఇంకా ముందుకెళ్లడానికి కలసికట్టుగా పనిచేద్దామని మన్యం జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో సోమవారం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మన్యం ఎక్కువగా గిరిజనులు నివసించే జిల్లా షైనింగ్ స్టార్స్ అవార్డులకు ఈ జిల్లాను ఎంపిక చేసుకున్నందుకు లోకేష్ బాబును అభినందించాలన్నారు.